Thursday, May 21, 2009

ఇది విదితమే !

ఎన్నికల ఫలితాలు చూసి సప్త సముద్రాల ఆవల నివసించే తెలుగు జాతికి ఆశ్చర్యం కలుగు నేమో గాని ,తెలుగు గడ్డపై
గాలిపిల్చుచున్న సామాన్యుడిని వచ్చిన ఫలితాలు సంభ్రమ పరుచ లేదు .ఎన్నికల రోజునే ఆతను ఇలా జరుగునని కేవలం ఉహించడమే కాదు కుండ బద్దలు కొట్టి చెప్పగలిగాడు. అవనీతిని జీర్ణించుకుని బ్రతక నేర్చిన మన ప్రజలు మార్పుని ఎలా అక్కున చేర్చ గలరు?మార్పు కోరే ఏకొద్దిమందో ఆరాటపడ్డారు ,తమ ఓటును సద్వినియోగం చేసారు
కానీ కడలి నీటిలో ఒక తెనేబొట్టు తీపిదాన్ని తేగలదా ?అలా అని మార్పు కోరే వాడు ప్రయత్నము మానుతాడా ? .మర్పు
రావాలి .అది ఒకరోజు వొస్తుంది.మనషి ఆశజీవి ,అందుకే బతకగల్గు చున్నాడు.చిరంజీవి పార్టీ చీలికను తెచ్చింది ,తెరాసా పార్టీ పోత్తంటూ పక్కన చేరింది..వచ్చిన ఫలితాన్ని అనుభవించక తప్పదు మరి !

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. హమ్మయ్యా! నీ హిందీ లో కాకుండా మా తెలుగు లో రాసవ్. :) మార్పు వస్తుంది వస్తుంది అని మీ తరం నుండి మా తరం వరకు ఎదురు చూసాం. ఏమి రాలేదు.. ఒక్క విషయం లో మార్పు వచ్చింది అప్పట్లొ కొంతమందే దొంగలు దుండగులు ఉండేవాళ్ళు ఎన్నికల్లో ఇప్పుడు అది ఒక రెక్వైర్మెంట్ అయ్యింది. అప్పట్లొ లక్షల్లో దోచుకునేవాళ్ళూ ఇప్పుడు కోట్లు కోట్లు స్వాహా చేస్తున్నారు. అది తప్ప ఏమి మార్పు లేదు. ఎదో అల ఒక్కరో ఇద్దరో లోక్ సత్తా జే.పీ లాంటివాళ్ళు తప్ప అందరు దొంగలే.

    ReplyDelete